Wednesday, March 25, 2009

జయ ప్రకాష్ నారయణ గారి చిత్త శుద్దికో ప్రశ్న...?

**ముఖ్యగమనిక : నేను అనబడే ఈ నేను.. ఏ పార్టికో లేక కులానికో వత్తాసు గా ఇది రాయడంలేదు దీనిని మాధ్యమం లేని కళ్ళాతో చూడ ప్రార్దనా **

సదరు ఈ జయ ప్రకాష్ నారయణ అనే వ్యక్తి 1953 లొ జన్మించి వైధ్య విధ్య పట్టబధ్రుడై 1980 లొ IAS అయ్యారు. ఇయనకు పెళ్ళి అయ్యింది కట్నం కూడా తీసుకున్నారు అనే అపవాదు కుడా ఉంది. దానికి ఈయన సమాధానం నాకు నా తల్లిథండ్రులు ఆస్తి ఇచ్చినట్టే నా భార్యకు వాళ్ళా తల్లిథండ్రులు ఇచ్చారు అని[ కట్నానికి కొత్త నిర్వచనంలా ఉంది కదు ఎంతైన IAS కదా..]. ఈయన 16 సం|| తరువాత రాజినామా(1996) చేసారు. [ అక్కడ కుళ్ళుని చూడ లేక రాజినామ చెసినావారు 16 సం|| దానిని భరించడం బహు కష్టం కదా... ]

ఒక IAS అంటే ఎంతో వందల్లొ ఒకరుగా వచ్చిన వ్యక్తి అధికారం ఉండాగనే ఆ కుళ్ళుని కడిగి పారేయొచ్చు కదా ఎం అలా చేసినా వారు లేరా ??? సరే పోని లోక్ సత్తా కి వచ్చేద్దాం దీనిని 1996 లో స్దాపించారు ఇప్పటికి చూచాయగా 13 సం|| వయసు లోక్ సత్తాకి. నేను అడగాలి అనుకోనె ప్రశ్న ఈ 13 సం||లాలో ఎం చేసారు ???. A.C.B వారే కొంచం నయం అప్పుడప్పుడు ఒకరిని అయినా పట్టుకుంటారు. అవినీతిని అంతం చెస్తాం అని వీరు ఎంతమందిని పట్టుకున్నారు ఈ రోజు లోక్ సత్తా కి ఉన్నా సత్తా తో ఒకడి జాతకాన్ని బయట పెడితే ఆపే దమ్ము ఎవడికి అయినా ఉందా??. కాని నాకు తెలిసి ఇంత వరకు అలాంటివి జరిగినా దాఖాలాలు లేవు. పోని మార్పుని మనతోనే మొదలు పెడదాం అని అనుకోని ఉంటారు అంటే అది మంచిదే ఈ విధంగా చూస్తే లోక్ సత్తా కి బాహ్యంగా సరైనా అమరికాలేదు. పోని అంతర అమరికా అయినా సరిగ్గాఉందా అంటే లోక్ సత్తా లో J.P కాకుండా ఇంకో పేరు కూడా ఎవరికీ తెలియదు. నేను అయితే ఇది కచ్చితంగా J.P చేతకానితనం అంటాను ఎందుకాంటే 13 సం|| వయసు గలా ఓ సంస్దాకి రెండవ పేరు లేకపోవడం అంటే అది ఖచ్చితంగా అయన Admnistartion skills లో లోపం కాని ఆయన ALL INDIA 2nd RANK సాధించారు అలాంటి వ్యక్తికీ ఈ Skill లేదు అనడం భావ్యం కాదు. ఒక వేళ అదే నిజమైతే ఆయనా లోక్ సత్త పై సరైనా శ్రద్ధ చూపనట్టే కదా??? మరి శ్రద్ధ లేని దాని మీద ఇప్పుడు మోజు ఎందుకటా?? ఈ రెంటిలో ఏది నిజం అటా ?? ఏదో బేతాళ - విక్రమార్క ప్రశ్నలా ఉంది కదా??

Friday, March 20, 2009

బాబాయి గారి అబ్బాయి (పేరడి)

మార్నింగ్ షో అనక మాట్నీ అనక
ఫస్ట్ షో అనక సెకండ్ షో అనక
మిడ్ నైట్ షో అనక ప్రివ్యూ అనక
సినిమా రీలీజ్ అయ్యి అవ్వగానే....
బ్లాక్ అనక రిజర్వడ్ అనక
వందనక వెయ్యిఅనక టికెట్టు కొని
నేలా, బెంచీ, మాసు, క్లాసు, కుర్చీ, రిజర్వడ్
అని తెడాలు మాని భేధాలు వదిలి ఎదైన సరే
సినిమా చూద్దాం అని వస్తె అందులో
నువ్వు అని మీ తండ్రీ అని
బాబాయ్ అని అన్న అని తమ్ముడు అని
వచ్చినా వాడు వచ్చినట్టు
దోరికిన దానిని దొరికినట్టు
కత్తి, సుత్తి, పలుగు, పారా అని తెడా లేకుండా
రాయి, రప్పా, రాడ్డు ఎది దొరికితె అది
తీసుకొని దొరికిన వాడిని దొరికినట్టు రోడ్డు పై
నరికిన వాడిని నరుక్కుంటూ మీసాలు మేలేసి
తోడలు కొట్టి జబ్బలు చరిచీ...
ఈలలు వేసీ గోలలు చెస్తుంటే అది చూసి
టాంక్ బండ్ పై నుంచి ఒకడు
రివాల్వర్ తో కాల్చుకొని ఇంకొకడు
నిర్మాతలు గగ్గోలు పెడుతూ ఉంటే
అది భారమై భరించలెక
సహింపలేక విసిగి వేసారి.. ఈసారి రిస్క్
వద్దు అని రోడ్ పైకి వస్తే ఇక్కడ కుడా
అవే డైలాగ్ లా......

** ప్రజా నాడి కోసం ఉండాల్సినా పట్టు
ప్రయోగించే బాష వేడి పై కాదు
ప్రజ్వరిల్లల్సినా అభివ్రుద్ది వాడి పై
నాయకులను పెట్టాలసిన గాడి పై ****

ఇది కేవలం హస్యం కోసం రాయబడినది.
మాధ్యమం లేని స్వచ్చమైన కళ్ళతో చూడండి
పార్టి, రాజకియం, కులం అనే కళ్ళా జొడులతో చుస్తే
అర్దం తప్పు గా స్పురిస్తుంది అని మనవి.
అందుకె ఇది ఎవరిని అయిన భాదిస్తె క్షమాపణలు లెవ్వు
ఎందుకంటే ఇది భాదించే ఉద్దేశాంతో రాసినది కాదు

All the best to them
keep smiling to you.....

Tuesday, March 10, 2009

యము౦డా!!!


కొన్ని చిత్రాలలో ఉ౦డే సన్నివేశాలు, స౦భాషణలు చెరగని ముద్ర వేస్తాయి..అలా నాకు నచ్చిన కొన్నిటిని ఇక్కడ పొ౦దుపరుస్తున్నాను..
మొదటి టపాలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్.టి.ఆర్ గారి డైలాగ్ రాయట౦ జరిగి౦ది..ఈ టపా లో కైకాల సత్యనారాయణ గారు యమలీల లో చెప్పిన ఈ డైలాగ్ మీ ము౦దు ఉ౦చుతున్నాను..త్వరలో ఇలా౦టివి మరిన్ని చేయటానికి ప్రయత్నిస్తూ శెలవు తీసుకు౦టున్నాను..


ధర్మ పరిరక్షణా దురందరుండా!
సకల పాప శిక్షణా దక్షుండా!
చండతర దండతర బాహుమండిత విగ్రహుండా!!
నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలణా నియముండా!!
హ...యముండా!!!!

Friday, February 27, 2009

సుయోధనా!

ఆచార్యా దేవా! ఏమంటివి? ఏమంటివి?
జాతి నెపమున సూతసుతునకి౦దు నిలువా అర్హతా లేదందువా?
ఎంతమాటా! ఎంతమాటా!
ఇది క్షాత్ర పరిక్ష గాని
క్షత్రియ పరీక్షగాదే! కాదూ కాకూడదు
ఇది కుల పరిక్షయె అందువా
నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది?
అతి జుగుప్సాకరమైనా నీ సంభవమెట్టిది
మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏకులము?
ఇ౦త ఎల? అస్మత్ పితమహుడు కురు కుల వృద్దుడుఅయిన
ఈ శాంతనవుడు శివసముద్రుని భార్య అగు గంగా గర్బమున జనియి౦చ లేదా!
ఈయనది ఏకులము ?
నాతొ జెప్పింతువేమయ్యా మా వంశమునకు
మూలపురుషుడైన వశిష్టుడు దేవ వేశ్య అగు ఉర్వశి పుత్రుడు కాడా!...
ఆతడు పంచమి జాతి కన్య అయినా అరుందతియందు శక్తిని,
ఆ శక్తి చండలంగని యందు పరాసురుని ,
ఆ పరాసురుడు పల్లె పడుచు అయినామత్స్యగ౦ధి అ౦దు మా తాత వ్యాసుని,
ఆ వ్యాసుడు విదవరాండ్రు అయినా మా పితామహి అంబికతో మాతండ్రి ని,
మా పిన పితమహి అ౦బాలికతో పిన తండ్రిపాండు రాజును,
మా ఇంటి దాసితో ధర్మా నిర్మాణాచరుడు అని మీచే కీర్తించబడు ఈ విదురదేవుని
కనలేదా!!...

సందర్బావసరాములనుబట్టి క్షేత్రబీజ ప్రాదాన్యములతో సంకరమైన మా కురు వంశము
ఏనాడొ కుల హీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్ద వాదము ఎందులకు?

నాయనా సుయోధనా!

తాతా


ఏరులా పారులా బ్రహ్మర్షుల జననములు మనము విచారి౦చ దగినవి కాదు..
ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరిక్షయే. క్షాత్రమున్నవారెల్లరు క్షత్రియులే్.
వారిలో రాజ్యమున్నవారే రాజులు. అట్టి రాజులే ఈ కురు రాజ పరిక్షత్తులో పాల్గొనుటకు అర్హులు.....


ఓహొ రాచరికమా అర్హతను నిర్ణయి౦చునది?
అయిన మా సామ్రాజ్య౦లో సస్యశ్యామలమై సంపద విరాలమై వెలుగొ౦దు
అంగరాజ్యమునకు ఇపుడే ఇతని్ మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను.
సోధరా దుశ్శాశనా అనర్ఘలము శక్తి కిరీటమును వేగముగతెమ్ము
మామా గా౦ధార సార్వభౌమా సురుచిరమణిమైమ౦డిత సువర్ణ సి౦హాసన౦ తెప్పి౦పుము
పరిజనులారా పుణ్య భగీరథి నదీ తోయములు అ౦దుకొనుడు
కళ్యాణ భక్తులారా మ౦గళ కురియారములు సుస్వరంబుగ మ్రోగనిండు
వ౦ధి మాగదులారా కర్ణ మహరజును స్యయివారము గావి౦పుడు
పుణ్యా౦గరులారా ఈరాధా సుతునకు ఫాలభాగమున కస్తూరితిలకములు తీర్చి దిద్ది బహుజన సుకృత పరిపాక సౌలబ్ధ సహజ కవచకైష్ట వైఢూర్య ప్రభారి౦చోటికి వా౦చలుచెలరేగ వీర గ౦ధము విధ్య రాల్పుడు
నేను ఈ సకల మహ జనసమక్షమున ప౦డిత పరిషత్ మధ్యమున
సర్వధ సర్వధ శతదా సహస్రధా ఈ కులకలక మహ పైల్కలములను శాశ్వతముగా ప్రక్షాళన గావి౦చెదను

ee sambhasana you tube lo chudandi

Tuesday, February 3, 2009

పరిచయం

ఇది తెలుగు లొ నా మొదటి బ్లాగ్
ఇప్పటికి ఇంతె అన్ని ఇప్పుడె చెప్పెస్థె ఎలా ???